RRR: అతిపెద్ద కొలాబరేషన్ ఏంటో చెప్పేసిన ‘ఆర్ఆర్ఆర్’ టీం.. ఇదిగో వీడియో

RRR Team Reveals The Worlds Largest Collaboration
  • పీవీఆర్ తో ఆర్ఆర్ఆర్ జట్టు
  • ‘పీవీఆర్ఆర్ఆర్’గా పేరు మార్పు
  • కొన్ని నెలల పాటు థియేటర్లకు అదే పేరు
  • పీవీఆర్ ఎండీతో కలిసి లోగోను ఆవిష్కరించిన రాజమౌళి
సర్ ప్రైజ్ ను చెబుతామన్న ‘ఆర్ఆర్ఆర్’ టీం దానిని వెల్లడించేసింది. ప్రపంచంలో ఇప్పటివరకెవరూ కనీవినీ ఎరుగని కొలాబరేషన్ ను ప్రేక్షకలోకానికి పరిచయం చేస్తామన్న టీం.. ఆ కొలాబరేషన్ ఏంటో చెప్పేసింది. దేశంలో ప్రముఖ మల్టిప్లెక్స్ అయిన పీవీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తనపేరునే మార్చుకుందంటూ వెల్లడించింది.

ఆర్ఆర్ఆర్ ను తన పేరులో కలిపేసుకుని ‘పీవీఆర్ఆర్ఆర్’గా మారిందంటూ ఆ సర్ ప్రైజ్ ను టీజర్ రూపంలో రివీల్ చేసింది. రాబోయే కొన్ని నెలల పాటు దేశవ్యాప్తంగా ఉన్న 70కిపైగా నగరాల్లోని 170కిపైగా ప్రాంతాల్లో ఉన్న 850కిపైగా స్క్రీన్లను ఇకపై ‘పీవీఆర్ఆర్ఆర్’గానే పిలుస్తారంటూ తెలిపింది.

థియేటర్ పేరును పీవీఆర్ ఎండీ అజయ్ బిజ్లీతో కలిసి రాజమౌళి ‘పీవీఆర్ఆర్ఆర్’లోగోను ఆవిష్కరించారు. ఇటు పీవీఆర్ కూడా ప్రపంచ సినీ చరిత్రలోనే రెండు ఎంటర్ టైన్మెంట్ దిగ్గజాలు కలిశాయని పేర్కొంటూ ట్వీట్ చేసింది.
RRR
Rajamouli
PVR
PVRRR
Tollywood
Bollywood
Kollywood

More Telugu News