Chandrababu: రేపటి నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన

Chandrababu Kuppam visit
  • రేపు, ఎల్లుండి కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు
  • రేపు కుప్పంలో బహిరంగసభ
  • ఎల్లుండి నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. గత పంచాయతి ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ ఘన విజయం సాధించింది. మరోవైపు కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ శ్రేణులను ఆకర్షించే కార్యాచరణ కూడా మొదలు పెట్టారు.

ఈ నేపథ్యంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ బలహీన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు దృష్టి సారించారని సమాచారం. దీంతో ఆయన కుప్పం పర్యటన ఆసక్తికరంగా మారింది. రేపు కుప్పంలో జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. 30వ తేదీన నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తారు. క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలతో మాట్లాడి వారిలో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారు.
Chandrababu
Telugudesam
Kuppam

More Telugu News