సాయిపల్లవి అంటే ఇష్టం: కేతిక శర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయిపల్లవి అంటే ఇష్టం: కేతిక శర్మ

Romantic movie update
  • పుట్టి పెరిగింది ఢిల్లీలో
  • సినిమాలంటే చాలా ఇష్టం
  • అలా పూరిగారి కంట్లో పడ్డాను
  • చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి  
ఇప్పుడు యూత్ లో విపరీతంగా వినిపిస్తున్న పేరు కేతిక శర్మ. 'రొమాంటిక్' సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా ఈ బ్యూటీ పరిచయమవుతోంది. ఆకాశ్ పూరి జోడీగా ఆమె నటించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది.

"నేను ఢీల్లీలో పుట్టి పెరిగాను ..  డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. నా ఇన్ స్టా చూసిన పూరిగారు పిలిపించి ఛాన్స్ ఇచ్చారు. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా నాకు నేనుగా బ్రతకాలనుకునే మౌనిక పాత్రను పోషించాను. తెరపై నన్ను నేను చూసుకోవాలనుకునే నా కోరిక నెరవేరబోతోంది.

ఇప్పుడున్న హీరోయిన్లలో సాయిపల్లవి అంటే నాకు చాలా ఇష్టం. రీసెంట్ గా ఆమె నటించిన 'లవ్ స్టోరీ' చూశాను. ఆమె చాలా గొప్పగా నటించింది. ఇక ఆమె డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు .. అంత అద్భుతంగా చేసింది. నాగశౌర్యతో ఒక సినిమా .. వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.
Akash Puri
Kethika Sharma
Puri Jagannadh

More Telugu News