బన్నీకి థ్యాంక్స్ చెప్నిన కరణ్ జొహార్

Karan Johar thanked Allu Arjun
  • 'వరుడు కావలెను' ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ వ్యాఖ్యలు
  • హిందీ చిత్రం సూర్యవంశి యూనిట్ కు శుభాకాంక్షలు
  • ఆ సినిమాను ఆదరించాలని ప్రేక్షకులకు పిలుపు
  • బన్నీ నిజంగా సూపర్ స్టారేనన్న కరణ్
గతంతో పోల్చితే ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ మధ్య సంబంధాలు విస్తృతమయ్యాయి. నటీనటుల మధ్య స్నేహం నుంచి సినిమా రిలీజ్ వ్యవహారాల వరకు అనేక అంశాలు చాలా మెరుగయ్యాయి. అందుకు అల్లు అర్జున్ వ్యాఖ్యలే నిదర్శనం. బన్నీ నిన్న 'వరుడు కావలెను' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరించాలని కోరారు. త్వరలోనే బాలీవుడ్ చిత్రం 'సూర్యవంశి' కూడా విడుదల అవుతోందని, ఆ చిత్రబృందానికి యావత్ దక్షిణాది తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం ద్వారా సినిమాకు పునర్ వైభవం కల్పించాలని కోరారు.

దీనిపై సూర్యవంశి చిత్ర నిర్మాత, ప్రముఖ ఫిలింమేకర్ కరణ్ జొహార్ స్పందించారు. నిజంగా ఏవిధంగా చూసినా అల్లు అర్జున్ సూపర్ స్టారేనని కొనియాడారు. 'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అల్లు అర్జున్' అంటూ ట్వీట్ చేశారు.

అటు సూర్యవంశి చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి కూడా బన్నీకి ధన్యవాదాలు తెలిపారు. పుష్ప చిత్రాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. 'నువ్వు రాక్ స్టార్ వి సోదరా' అంటూ స్పందించారు. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన సూర్యవంశి చిత్రం నవంబరు 5న థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
Go Back to Shorts
Karan Johar
Allu Arjun
Sooryavanshi
Release
Bollywood
Tollywood

More Telugu News