టీడీపీ నేతల డ్రామాలన్నీ మోదీ, అమిత్ షాలకు తెలుసు: మంత్రి కన్నబాబు
- ఢిల్లీలో టీడీపీ నేతల పర్యటన
- ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారన్న కన్నబాబు
- ఉనికిని చాటుకునే ప్రయత్నాలు అంటూ విమర్శలు
- చంద్రబాబుకు నిబద్ధత లేదని వ్యాఖ్యలు
"ఏపీ డ్రగ్స్ మయం అంటూ ఢిల్లీ గల్లీల్లో చెబుతున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలతో ఇతర రాష్ట్రాలు మన గురించి ఏమనుకుంటాయి? రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజల గౌరవాన్ని చంద్రబాబు తగ్గిస్తున్నారు" అంటూ కన్నబాబు విమర్శించారు. క్రమశిక్షణ, నిబద్ధత, కట్టుబాట్లు ఏవీ లేని చంద్రబాబు గురించి అందరికీ తెలుసని అన్నారు.