'రొమాంటిక్' మూవీ నుంచి మరో ట్రైలర్!
- యూత్ కోసం 'రొమాంటిక్'
- కేతిక శర్మ పరిచయం
- కీలకపాత్రలో రమ్యకృష్ణ
- ఈ నెల 29న థియేటర్లకు
ఆకాశ్ పూరి పాత్ర పైనే పూర్తి ఫోకస్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఇది. కొన్ని విజువల్స్ 'పోకిరి' సినిమాను గుర్తుకుచేస్తాయి. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తోంది. ఈ పాత్ర చేయడానికి రమ్యకృష్ణ అంగీకరించిన దగ్గర నుంచి ఈ సినిమా జాతకమే మారిపోయిందని పూరి చెప్పడం వలన, అందరిలో మరింత ఆసక్తి పెరిగింది. ప్రేమకీ .. మోహానికి మధ్యగల తేడా చుట్టూ అల్లుకున్న రొమాంటిక్ మూవీ ఇది.