టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు సుప్రీంకోర్టులో ఊరట
- గొట్టిపాటి గ్రానైట్ కు ఏపీ సర్కారు షోకాజ్ నోటీసులు
- నోటీసులపై గతంలో స్టే ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్
- సింగిల్ బెంచ్ ఆదేశాలను పక్కనబెట్టిన డివిజన్ బెంచ్
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన గొట్టిపాటి
దీనిపై గొట్టిపాటి హైకోర్టును ఆశ్రయించగా, షోకాజ్ నోటీసులను సింగిల్ బెంచ్ కొట్టివేసింది. అయితే డివిజన్ బెంచ్ ఆ ఆదేశాలను పక్కనబెట్టింది. దాంతో గొట్టిపాటి రవికుమార్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
తమ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ సిఫారసు చట్టవిరుద్ధమని రవికుమార్ పేర్కొన్నారు. వాదనలు విన్న పిమ్మట ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసులను నిలుపుదల చేస్తున్నట్టు సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.