TDP Office: టీడీపీ కార్యాలయం, పట్టాభి నివాసంపై దాడులకు పాల్పడిన నిందితుల అరెస్ట్

Police arrests attackers of TDP Office and Pattabhi residence
  • మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి
  • విజయవాడలో పట్టాభి నివాసం ధ్వంసం
  • టీడీపీ ఆఫీసు దాడి ఘటనలో 10 మంది అరెస్ట్
  • పట్టాభి ఇంటిపై దాడి ఘటనలో 11 మంది అరెస్ట్
అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపైనా, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపైనా దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10 మందిని, పట్టాభి నివాసంపై దాడి ఘటనలో 11 మందిని అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై పల్లపు మహేశ్, గోక దుర్గాప్రసాద్, షేక్ అబ్దుల్లా, శేషగిరి, పానుగంటి చైతన్య, జోగ రమణ, పేరూరి అజయ్, అడపాల గణపతి, కోమటిపల్లి దుర్గారావు, పవన్ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.

మంగళగిరి ఎన్టీఆర్ భవన్ కు పోలీసుల నోటీసులు

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయ ఉద్యోగి బద్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడి నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజి ఇవ్వాలంటూ పోలీసులు ఎన్టీఆర్ భవన్ సిబ్బందిని కోరారు. సాయంత్రం 5 గంటల్లోపు ఫుటేజి వివరాలు సమర్పించాలని సూచించారు. ఈ మేరకు రిసెప్షన్ కమిటీ సభ్యుడు కుమారస్వామికి నోటీసులు అందజేశారు.
TDP Office
Pattabhi
Police
Arrests
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News