శతకోటి డోసుల వ్యాక్సిన్ వినియోగంపై రామ్ చరణ్ ట్వీట్
- మొన్నటితో భారత్ రికార్డు
- భారత్ సాధించిన ఘనతపై చెర్రీ హర్షం
- ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వైద్య బృందాలకు కృతజ్ఞతలు
ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశాడు. భారత్ విజయవంతంగా 100 డోసుల వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తి చేసుకుందని గుర్తు చేశాడు. భారత్ ఈ ఘనత సాధించడానికి పని చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వైద్య బృందాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెర్రీ చెప్పాడు. కాగా, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. చెర్రీ హీరోగా శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కూడా రూపొందుతోంది.