Chandrababu: చంద్రబాబుకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారు

 President Kovind appointment finalized for Chandrababu
  • సోమవారం ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
  • రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరిన బాబు
  • రాష్ట్రంలోని పరిస్థితులను రాష్ట్రపతికి వివరించనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడుల నేపథ్యంలో ఈ విషయాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. ఆర్టికల్ 356ని ప్రయోగించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఇంతకుముందే చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ ను ఆయన కోరారు. చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఖరారు చేసినట్టు రాష్ట్రపతి భవన్ నుంచి సమాచారం అందింది.

మరోవైపు ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతి, కేంద్ర మంత్రులకు చంద్రబాబు వివరించనున్నారు. చంద్రబాబుతో పాటు పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు.
Chandrababu
Ram Nath Kovind
Telugudesam
President Of India

More Telugu News