Nagarjuna: నాగ్ 'ఘోస్ట్'లో అఖిల్ గెస్టు రోల్!

Nagarjuna Ghost movie update
  • నాగార్జున హీరోగా 'ఘోస్ట్'
  • దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు
  • కొంతవరకూ చిత్రీకరణ పూర్తి  
  • కీలకమైన గెస్టు రోల్
నాగార్జున ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. చైతూ చేసిన 'లవ్ స్టోరీ' .. 'అఖిల్' చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా భారీ విజయాలను అందుకోవడం ఆయనకి సంతృప్తిని కలిగించిన విషయం. ఇక ఈ నేపథ్యంలో ఆయన 'బంగార్రాజు'  సినిమాలో చైతూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక నాగార్జున చేస్తున్న 'ఘోస్ట్' సినిమాలో అఖిల్ గెస్టుగా కనిపించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. నాగార్జున హీరోగా నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు ..  శరత్ మరార్ 'ఘోస్ట్' సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగును జరుపుకుంది. ఇందులో గెస్టు రోల్ ఉండటం .. ఆ రోల్ కి ప్రాముఖ్యత ఉండటంతో అఖిల్ తో చేయించాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ పేరు వినిపిస్తోంది.
Nagarjuna
Praveen Sattharu
Kajal Agarwal
Akhil

More Telugu News