కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి ముందర శుభవార్త
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
- పెన్షనర్లకు డీఆర్ పెంపు
- నేటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం
- ఈ ఏడాది జులై నుంచి వర్తింపు
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 28 శాతం డీఏ ఇస్తున్నారు. ఇప్పుడది 31 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయంతో 47 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. తాజా పెంపు ఈ ఏడాది జూలై నుంచి వర్తింపచేయనున్నారు. ఇక, కేంద్రం నిర్ణయంతో 68 లక్షల మందికి పైగా పెన్షనర్లకు కూడా లబ్ది చేకూరనుంది.