సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ప్రభాస్ కి కృతి సనన్ కాంప్లిమెంట్స్
- 'హరిహర వీరమల్లు' తాజా షెడ్యూల్
- ప్రభాస్ తో మరో బాలీవుడ్ సినిమా?
* పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' చిత్రం తాజా షెడ్యూలు షూటింగును ఈ నెల 25 నుంచి తిరిగి నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షెడ్యూలులో భారీ యాక్షన్ దృశ్యాలను కూడా చిత్రీకరిస్తారట. పవన్ తో పాటు బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రామ్ పాల్ కూడా ఈ షెడ్యూలులో పాల్గొంటారు.
* ఇప్పటికే పలు భారీ చిత్రాలతో బిజీగా వున్న హీరో ప్రభాస్ మరో బాలీవుడ్ నిర్మాతతో పనిచేసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రభాస్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా సమాచారం.