తెలంగాణలో కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసుల వెల్లడి

Telangana corona status report
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 45,418 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 208 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 14, మంచిర్యాల జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు గుర్తించారు. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 201 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,69,163 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,61,294 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,929 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా మృతుల సంఖ్య 3,940కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Status Report
Daily Cases

More Telugu News