ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు దుర్మరణం

ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. దుర్గాదేవి విగ్రహ నిమజ్జన ఉత్సవానికి భక్తులు ట్రాక్టర్‌పై వెళ్తున్న సమయంలో అది ఒక్కసారిగా బోల్తాపడింది. ముదిగొండ మండలం బాణాపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను 108 అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Telangana
Khammam District
Mudigonda
Road Accident

More Telugu News