హైదరాబాదులో భారీ వర్షం... ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
- నగరంలోని పలు ప్రాంతాలు జలమయం
- లోతట్టు ప్రాంతాలు నీటమునక
- ట్రాఫిక్ కు అంతరాయం
- వాహనదారులకు ఇబ్బందులు
నగరంలో భారీ వర్షం నేపథ్యంలో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది. దాంతో కొన్నిచోట్ల వాహనాలు నీట మునిగిన పరిస్థితి కనిపించింది.