Kurnool District: దేవరగట్టు కర్రల సమరంలో హింస.. 100 మందికిపైగా గాయాలు, 9 మంది పరిస్థితి విషమం

Devaragattu Karrala samaram 100 people injured
  • గత అర్ధరాత్రి ప్రారంభమైన దసరా బన్ని జైత్రయాత్ర
  • ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు కర్రలతో దాడిచేసుకున్న గ్రామస్థులు
  • క్షతగాత్రులకు ఆలూరు, ఆదోని, కర్నూలు ఆసుపత్రులలో చికిత్స  
కర్నూలు జిల్లా దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి కర్రల సమరంలో హింస చెలరేగింది. గత అర్ధరాత్రి స్వామివారి దసరా బన్ని జైత్రయాత్ర ప్రారంభం కాగా, ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు ఒకవైపు విడిపోయి కర్రలతో తలపడ్డారు. ఈ ఆచారం అనాదిగా కొనసాగుతోంది. ఈ సమరంలో  100 మందికిపైగా భక్తులకు గాయాలయ్యాయి. 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆలూరు, ఆదోని, కర్నూలు ఆసుపత్రులకు తరలించారు.
Kurnool District
Devaragattu
Karrala Samaram
Dasara

More Telugu News