Britain: బ్రిటన్ ఎంపీ దారుణ హత్య.. చర్చిలో కత్తితో పొడిచి చంపిన నిందితుడు

Britain MP David Amess stabbed at constituency meeting
  • ‘మీట్ యువర్ లోకల్ ఎంపీ’ కార్యక్రమంలో ఘటన
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డేవిడ్ అమీస్ మృతి
  • అధికార పార్టీకి చెందిన అమీస్‌కు మంచి గుర్తింపు
  • గతంలోనూ బ్రిటన్ ఎంపీలపై దాడులు
చర్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బ్రిటన్ ఎంపీ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. దుండగుడు కత్తితో విరుచుకుపడి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ నేత, ఎంపీ అయిన డేవిడ్ అమీస్ (69) శుక్రవారం స్థానిక లీ-ఆన్-సీలోని ఓ చర్చిలో నిర్వహించిన ‘మీట్ యువర్ లోకల్ ఎంపీ’ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ క్రమంలో ఆయనపై అకస్మాత్తుగా దాడిచేసిన ఓ వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన ఎంపీని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

అమీస్ 1983 నుంచి ఎంపీగా ఉన్నారు. ఎసెక్స్‌‌లోని సౌత్ఎండ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జంతు సమస్యలతోపాటు, గర్భస్రావాలకు వ్యతిరేకంగా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు. అమీస్ మృతికి ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను భయంకరమైనదిగా, తీవ్ర దిగ్భ్రాంతికరమైనదిగా ప్రతిపక్ష లేబర్ పార్టీ అభివర్ణించింది.

బ్రిటన్‌లో ఎంపీలపై దాడులు గతంలోనూ పలుమార్లు జరిగాయి. 2016 బ్రెగ్జిట్ సమయంలో లేబర్ పార్టీ ఎంపీ జో కాక్స్‌ కాల్చివేతకు గురయ్యారు. 2010లో లేబర్ పార్టీ ఎంపీ స్టీఫెన్ టిమ్స్‌పై దాడిచేసిన దుండగులు కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. 2000వ సంవత్సరంలో లిబరల్ డెమొక్రటిక్ ఎంపీ నీగెల్ జోన్స్‌పై దాడి జరిగింది. జులై 30, 1990లో కన్జర్వేటివ్ ఎంపీ ఇయాన్ గౌ కారు బాంబు దాడిలో మృతి చెందారు.
Britain
UK
MP Sir David Amess
Stattbed
Killed

More Telugu News