NV Ramana: తిరుపతి, తిరుమల పర్యటనకు వస్తున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

CJI NV Ramana two days tour in Tirupathi and Tirumala
  • రేపు, ఎల్లుండి తిరుపతి, తిరుమలలో పర్యటన
  • హైదరాబాద్ నుంచి రేణిగుంట రాక
  • తిరుపతిలో బస
  • ఈ నెల 15న తిరుమలలో పర్యటన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలో పర్యటించనున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 12.35 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రాత్రికి తిరుపతిలో బస చేసి, మరుసటి రోజు తిరుమల వెళతారు. మధ్యాహ్నం 2.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 3.20 గంటలకు హైదరాబాద్ తిరిగివస్తారు. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన వివరాలను చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ వెల్లడించారు.
NV Ramana
CJI
Supreme Court
Tirupati
Tirumala

More Telugu News