Prakash Raj: అందుకే అప్పుడు నాపై నిషేధం విధించారు: ప్ర‌కాశ్ రాజ్

prakash raj on ban on him
షార్ట్స్‌లో చూడండి
సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ప‌లు విష‌యాలు తెలిపారు. గ‌తంలో తాను హీరో మహేశ్ బాబుతో ఒక సినిమా చేయాల్సి ఉంద‌ని, అయితే, ఆ షూటింగ్‌ వాయిదా వేస్తూ వెళ్తుండటం వల్ల సమయానికి డేట్లు కుదరలేదని ఆయ‌న చెప్పారు. దీంతో ఆ పాత్ర‌కు త‌న స్థానంలో వేరే నటుడిని తీసుకున్నారని తెలిపారు.

అయితే, మీడియాలో మాత్రం త‌న‌ను తీసేసి వేరే నటుడిని పెట్టుకున్నారని రాశారని చెప్పారు. అలా ఎలా  రాస్తారని గట్టిగా అడగడంతో త‌న‌ను బ్యాన్‌ చేశారని చెప్పారు. అంతేగాక‌, తాను శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేస్తోన్న స‌మ‌యంలో ఆయనకు కావాల్సిన వేగం రావట్లేదని తెలిపారు.

దీంతో తాను షూటింగ్ నుంచి వెళ్లిపోయానని, త‌ర్వాత కలిసి మాట్లాడమని శ్రీ‌ను వైట్ల‌కు చెప్పాన‌ని అన్నారు. అయితే, త‌న‌ స్థానంలో సోనూసూద్ ను పెట్టి సినిమా తీశార‌ని తెలిపారు. అనంత‌రం తాను బూతులు తిట్టానని పేర్కొంటూ, నిషేధం విధించారని వివ‌రించారు. తాను రూ.120తో చెన్నైకి వచ్చానని, మ‌న‌ జీవితంలో మొదట్లో లక్ష్యాలు పెట్టుకుంటామని, ఆ ల‌క్ష్యాన్ని చేరుకున్నాక ఇంకేదో చేయాలనిపిస్తుందని అన్నారు. అయితే, త‌న‌కు ప్రత్యేక లక్ష్యాలు అంటూ ఏమీ లేవని తెలిపారు.
Go Back to Shorts
Prakash Raj
Tollywood

More Telugu News