ఉత్తరాఖండ్లో బీజేపీకి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్లో చేరిన రవాణా మంత్రి, ఎమ్మెల్యే సంజీవ్
- కాంగ్రెస్లో చేరడానికి ముందే గవర్నర్కు రాజీనామా లేఖలు
- బీజేపీలో ఒక్క రోజు కూడా సంతోషంగా లేనన్న యశ్పాల్ ఆర్య
- పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో తాను ఒక్క రోజు కూడా సంతోషంగా లేనని పేర్కొన్నారు. కాంగ్రెస్లో చేరడం తిరిగి సొంతింటికి వచ్చినంత ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. సూర్జేవాలా మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో దళితుల అభివృద్ధికి యశ్పాల్ విశేష కృషి చేశారని కొనియాడారు. కాగా, కాంగ్రెస్లో చేరడానికి ముందే యశ్పాల్, ఆయన కుమారుడు సంజీవ్ తమ రాజీనామా లేఖలను గవర్నర్కు పంపారు.