'మా' ఎన్నికల్లో అనసూయ గెలుపోటముల ట్విస్ట్!
- ముగిసిన మా ఎన్నికలు
- విజేతల జాబితా విడుదల
- అనసూయ భారీ మెజారిటీతో గెలిచినట్టు నిన్న వార్తలు
- నేడు ఆమె పేరు జాబితాలో లేని వైనం
ఈసీ మెంబర్లుగా 18 మంది ఎన్నిక కాగా, అందులో మంచు విష్ణు ప్యానెల్ కు చెందినవారు 10 మంది ఉండగా, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందినవారు 8 మంది ఉన్నారు. దీనిపై అనసూయ స్పందిస్తూ, రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా? అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అసలు, 600 పైచిలుకు ఓట్లు లెక్కించడానికి రెండ్రోజుల సమయం అవసరమా? అని సందేహం వ్యక్తం చేశారు.