CM Jagan: తిరుపతి చేరుకున్న సీఎం జగన్... చిన్నపిల్లల గుండె చికిత్స కేంద్రం ప్రారంభం

CM Jagan arrives Tirupati
  • రెండ్రోజుల పర్యటనకు తిరుపతి విచ్చేసిన సీఎం జగన్
  • నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం
  • రేపు బ్రహ్మోత్సవాలకు హాజరు
  • తిరుమల వెంకన్నకు పట్టువస్త్రాల సమర్పణ
సీఎం జగన్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి చేరుకున్నారు. నగరంలోని బర్డ్ ఆసుపత్రిలో చిన్న పిల్లల హృద్రోగాల చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు. ఆపై, అలిపిరి శ్రీవారి పాదాల వద్ద గోమందిరం, మరింత మెరుగుపరిచిన అలిపిరి నడక మార్గం ప్రారంభోత్సవాల్లోనూ పాల్గొన్నారు. సీఎం జగన్ విజయవాడ నుంచి ఈ మధ్యాహ్నం తర్వాత బయల్దేరి తిరుపతి విచ్చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి, వెల్లంపల్లి, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రేపు తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
CM Jagan
Tirupati
Tirumala
YSRCP
Andhra Pradesh

More Telugu News