ఏపీలో గత 24 గంటల్లో 310 కరోనా కేసుల వెల్లడి
- ఏపీలో బాగా తగ్గుముఖం పట్టిన కరోనా
- గత 24 గంటల్లో 23,022 కరోనా పరీక్షలు
- గుంటూరు జిల్లాలో 54 కేసులు
- అనంతపురం జిల్లాలో ఇద్దరికి పాజిటివ్
- ఇంకా 7,258 మందికి చికిత్స
అదే సమయంలో 994 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,57,562 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,36,048 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,258 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 14,256కి పెరిగింది.