అలాంటి పనులు మనుషులు మాత్రం చేయరు.. సినీ నటి హేమపై శివబాలాజీ భార్య ఫైర్
- పోలింగ్ రోజున శివబాలాజీ చేతిని కొరికిన హేమ
- ఇంకా దీనికన్నా నేను ఏమీ చెప్పలేను
- శివబాలాజీ గెలిచినందుకు సంతోషంగా ఉంది
ఈ ఘటనపై శివ బాలాజీ భార్య మధుమిత స్పందించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'అటువంటి పనులు మనుషులు మాత్రం చేయరండి.. ఇంకా దీనికన్నా నేను ఏమీ చెప్పలేను' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, తన భర్త విజయం సాధించడం పట్ల మధుమిత స్పందిస్తూ... 'మనం నిస్వార్థంగా సేవ చేసినప్పుడు దానికి ప్రతిఫలంగా విజయం దక్కలేదంటే ప్రపంచంలో దేనికీ విజయం దక్కదని పేర్కొంది. 'శివబాలాజీ గెలుస్తాడని నేను మొదటి నుంచి నమ్మకంతో ఉన్నాను. గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది' అని చెప్పింది.