అటువంటి వారికి సరైన గుణపాఠం చెప్పారు: 'మా' ఫలితాలపై బండి సంజయ్ వ్యాఖ్యలు
- ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు
- జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించారు
- దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే గుంపునకు బుద్ధి చెప్పారు
చివరికి ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారని ఆయన చెప్పారు. అందరికీ అభినందనలు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్ల విజేతలకు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన మా ఓటర్లకు ధన్యవాదాలు అంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే గుంపునకు మద్దతు పలికిన వారికి ఇది సరైన గుణపాఠం అని ఆయన చెప్పారు.