‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచిన కాసేపటికే.. నాగబాబు షాకింగ్ నిర్ణయం
- ‘మా’ సభ్యత్వానికి రాజీనామా
- ప్రాంతీయవాదంతో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన
- అలాంటి అసోసియేషన్లో కొనసాగడం ఇష్టం లేదన్న నాగబాబు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంకుచిత మనస్తత్వం, ప్రాంతీయవాదంతో కొట్టుమిట్టాడుతున్న మా అసోసియేషన్లో కొనసాగడం ఇష్టం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. రాజీనామా లేఖను 48 గంటల్లో ‘మా’ కార్యాలయానికి పంపుతానని పేర్కొన్నారు. ఆషామాషీగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకోలేదని, పలు విధాలుగా ఆలోచించిన తర్వాత పూర్తి చిత్తశుద్ధితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాగబాబు తెలిపారు.