MAA: కొనసాగుతున్న 'మా' ఓట్ల లెక్కింపు... పర్యవేక్షిస్తున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు

MAA votes counting continues
తీవ్ర ఉత్కంఠ నడుమ 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓట్ల కౌంటింగ్ కోసం 6 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటింగ్ టేబుల్ వద్ద ఇద్దరిని అనుమతిస్తున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని నిర్ణయించినా, ఆపై షెడ్యూల్ మార్చారు. ముందుగా మా కార్యవర్గ అభ్యర్థుల ఓట్లు లెక్కిస్తున్నారు. అనంతరం అధ్యక్ష అభ్యర్థుల ఓట్లు లెక్కించనున్నారు. చివరిగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మాలో గతంలో ఎన్నడూ లేనంతగా భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో పలు నగరాల్లో ఉన్న మా సభ్యులు కూడా నేడు హైదరాబాద్ వచ్చి ఓటు వేశారు.
MAA
Elections
Counting
Votes

More Telugu News