Pragya Jaiswal: మరోసారి కరోనా బారినపడిన బాలకృష్ణ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్
- 'అఖండ' చిత్రంలో నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్
- గతంలో ఓసారి కరోనా బారినపడిన ప్రగ్యా
- ఆపై రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వైనం
- అయినా రెండోసారి కరోనా
టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, తాను మరోసారి కరోనా బారినపడ్డానని ప్రగ్యా జైస్వాల్ వెల్లడించింది. గతంలో ఓసారి కరోనా బారినపడ్డానని, ఆ తర్వాత వ్యాక్సిన్ కూడా రెండు డోసులు తీసుకున్నానని, అయిన్నపటికీ మళ్లీ కరోనా సోకిందని ప్రగ్యా వాపోయింది.
ప్రస్తుతం తాను స్వల్ప లక్షణాలతో బాధపడుతుండడంతో ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపింది. డాక్టర్ల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించింది. గత 10 రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.
ఇటీవల అఖండ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో చిత్రయూనిట్ వేడుక చేసుకుంది. ఇందులో హీరో బాలకృష్ణతో పాటు ప్రగ్యా జైస్వాల్ కూడా పాల్గొంది. ఇప్పుడు ఆమెకు కరోనా నిర్ధారణ కావడంతో అఖండ చిత్ర యూనిట్ లో కలకలం రేగింది.