ఇక చాలు ఆపండి: 'మా' ఎన్నికల తీరుపై రోజా
- విద్వేష రాజకీయాలు వద్దు
- పక్క నుంచి మాట్లాడేవారి వల్లే గొడవలు
- ఎవరూ ఎవరికీ శత్రువులు కాదు
- అందరిదీ ఒకే కుటుంబం
అందరిదీ ఒకే కుటుంబమని, కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందరూ కలిసి కట్టుగా కనిపించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. మాలో ఉన్న 900మంది మాత్రమేనని గుర్తు చేశారు. మంచి వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఎవరు గెలిచినా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో మాట్లాడి సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్‌లో తనతో కలిసి పనిచేసిన నటులు ఉన్నారని ఆమె తెలిపారు.