డ్రగ్స్ కేసు.. విజయవాడ ఆషీ ట్రేడింగ్ కంపెనీ నివాసంలో ఎన్ఐఏ తనిఖీలు
- ఆఫ్ఘనిస్థాన్ నుంచి విజయవాడలో ఆషీ ట్రేడింగ్ పేరుతో డ్రగ్స్ రవాణా
- ముంద్రా పోర్టులో 2,988 కిలోల హెరాయిన్ పట్టివేత
- కీలక సూత్రధారి సుధాకర్ భార్య పుట్టింటిలో సోదాలు
- స్థానికుల నుంచి వాంగ్మూలాల సేకరణ
- చెన్నై, కోయంబత్తూరులోనూ సోదాలు
ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న మాచవరం సుధాకర్ ఈ కంపెనీని రిజిస్టర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన భార్య దుర్గా పూర్ణిమా వైశాలి పుట్టినిల్లు చిరునామా ఇచ్చారు. దీంతో అధికారులు ఆ ఇంట్లోనూ సోదాలు చేశారు. స్థానికులను విచారించి పలు వివరాలు సేకరించి, వాంగ్మూలాలు సేకరించారు. అలాగే, చెన్నై శివారులోని కోలంపక్కం వీవోసీ వీధిలోని ఓ అపార్ట్మెంటులో సుధాకర్, వైశాలి ఉండేవారు. దీంతో ఆ ఫ్లాట్‌లోనూ అధికారులు సోదాలు చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వీరిని డ్రగ్స్ ఉచ్చులోకి దింపిన కోయంబత్తూరుకు చెందిన రాజ్‌కుమార్ ఇల్లు, కార్యాలయంలోనూ సోదాలు చేశారు.