సైదాబాద్ చిన్నారి కుటుంబానికి నగదు చెక్కు అందజేసిన పవన్ కల్యాణ్
- ఇటీవల సంచలనం సృష్టించిన ఘటన
- సైదాబాద్ చిన్నారిపై హత్యాచారం
- నిందితుడు రాజు ఆత్మహత్య
- చిన్నారి కుటుంబాన్ని అక్కున చేర్చుకున్న జనసేనాని
కొన్ని వారాల కిందట పల్లకొండ రాజు అనే యువకుడు ఇంటి పక్కనే ఉండే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారకుడైన ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. పోలీసులు రాజు కోసం తీవ్ర గాలింపు చేపట్టగా, అతడు స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై విగతజీవిలా కనిపించాడు. రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.