నిర్మాతగా కోడి రామకృష్ణ కూతురు .. మొదలైన ఫస్టు మూవీ షూటింగ్!
- కోడి దివ్యదీప్తి నిర్మాతగా సినిమా
- హీరోగా కిరణ్ అబ్బవరం
- కథానాయికగా సంజన ఆనంద్ పరిచయం
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
కిరణ్ అబ్బవరం - సంజన ఆనంద్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి, కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హీరో, హీరోయిన్లపై నిర్మాత రామలింగేశ్వరరావు క్లాప్ ఇవ్వగా .. ఎ.ఎమ్.రత్నం కెమెరా స్విచ్ఛాన్ చేయగా .. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు, అల్లు అరవింద్ .. మురళీ మోహన్ .. ఎస్వీ కృష్ణారెడ్డి .. అచ్చిరెడ్డి హాజరయ్యారు. కోడి దివ్యతో పాటు ఈ సినిమా టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.