Neeraj Chopra: అందుకే జుట్టును కత్తిరించేశా: ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా

Neeraj Chopra Shares Secret Behind Cutting His Long Hair

  • ఎప్పుడూ కళ్ల మీద పడుతుండేదన్న బల్లెం వీరుడు
  • సగం ఏకాగ్రత దానిమీదే ఉండేది
  • పతకం రాకపోయుంటే నా జుట్టునే టార్గెట్ చేసేవారు
  • ఆ స్టైల్ కరెక్ట్ కాదనిపించి వెంటనే తీసేశా

ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రాకు ఇప్పుడంటే జుట్టు లేదు కానీ.. ఒకప్పుడు పెద్ద పెద్ద జులపాలతో ఉండేవాడు. 2016లో జూనియర్ చాంపియన్ షిప్ గెలిచినప్పుడు, జకార్తా ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ గెలిచిన సమయంలోనూ అతడికి ముందుకుపడిపోయేంత పెద్ద జుట్టు ఉండేది. కానీ, టోక్యో ఒలింపిక్స్ నాటికి ఆ జుట్టు పోయింది. కారణం, దాని వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని నీరజ్ చోప్రానే ఆ జుట్టును కత్తిరించేశాడట. ఓ ఇంగ్లిష్ వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో గోల్డెన్ బాయ్ ఈ కామెంట్ చేశాడు.

‘‘ఆ జుట్టు మొత్తం నా కళ్ల మీదే పడుతుండేది. పైగా చెమట కూడా ఎక్కువ పట్టి మొహం మీదే పడేది. దీంతో నా సగం ఏకాగ్రత జుట్టు మీదకే పోయేది. నేను టోక్యోలో పతకం సాధించాలంటే అది కరెక్ట్ స్టైల్ కాదనిపించింది. ఒకవేళ పతకం పోతే అందరూ నా జుట్టును టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించేవారే. అందుకే పతకం గెలిచేందుకు జుట్టును తీసేస్తేనే మంచిదనిపించి.. పొడవు జులపాలను మొత్తం కత్తిరించేశాను’’ అని చెప్పుకొచ్చాడు.

ఇక, తాను షూటింగ్ లోనూ అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నానని, కానీ, అది తనకు సరిపోలేదని చెప్పాడు. మిగతా ఆటలు ఒకెత్తు, షూటింగ్ ఇంకొక ఎత్తు అని అన్నాడు. షూటింగ్ లో పతకం గెలవాలంటే మనసును మొత్తం దాని మీదే కేంద్రీకరించాలని చెప్పుకొచ్చాడు. అది తన వల్ల కాలేదని అన్నాడు. ఒలింపిక్ పతకాన్ని పదేళ్ల పాటు అభినవ్ బింద్రా బయటకు తీయలేదని వివరించాడు. తన బలవంతం మీదే ఒకసారి బయటకు తీశాడని, అది కూడా విసుక్కుంటూనే అని చెప్పాడు.

  • Loading...

More Telugu News