Nagababu: అమ్మమ్మను తలుచుకుని భావోద్వేగాలకు లోనైన నాగబాబు

Nagababu gets emotional on his maternal grandmother death anniversary
  • అమ్మమ్మ వర్ధంతి సందర్భంగా మెగాబ్రదర్ స్పందన
  • తమ అందరి జన్మలకు మూలమైన స్త్రీ అని వెల్లడి
  • అమ్మమ్మా నీ త్యాగం, ప్రేమానురాగాలు మరువలేమని వ్యాఖ్యలు
  • ఐ లవ్యూ అమ్మమ్మా అంటూ ట్వీట్
మెగాబ్రదర్ నాగబాబు తన అమ్మమ్మ వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించారు. తమ అందరి జన్మలకు మూలమైన స్త్రీమూర్తి, మహాతల్లి అయిన ప్రియమైన అమ్మమ్మ (కొణిదెల అంజనాదేవి తల్లి) తమకు దూరమైన రోజు అని వెల్లడించారు.

"అమ్మమ్మా... మేం బ్రతికున్నంత కాలం నీ త్యాగం, ప్రేమ, అనురాగం మర్చిపోలేం" అని వ్యాఖ్యానించారు. "ఐ లవ్యూ అమ్మమ్మా" అంటూ భావోద్వేగాలకు లోనయ్యారు. అంతేకాదు తన అమ్మమ్మ ఫొటోను కూడా పంచుకున్నారు.
Nagababu
Grandmother
Maternal
Mega Family
Tollywood

More Telugu News