జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ.. తెలుగువారికి పెద్దపీట!

Telugu leaders in BJP executive committee
  • తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డిలకు చోటు
  • ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు స్థానం
  • జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరి నియామకం
జాతీయ నూతన కార్యవర్గాన్ని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. ఈ కార్యవర్గంలో తెలుగువారికి పెద్దపీట వేశారు. జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మరో మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావులకు చోటు లభించింది. ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు స్థానం కల్పించారు.

ఆఫీస్ బేరర్లలో తెలంగాణ నుంచి డీకే అరుణను నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపిక చేశారు. జాతీయ కార్యదర్శిగా ఏపీ నుంచి సత్యకుమార్ ను నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్ లకు స్థానం లభించింది.
Go Back to Shorts
Telugu leaders
BJP
Executive Committee

More Telugu News