Duck: సోషల్ మీడియాలో పాప్యులర్.. లక్షల్లో ఆర్జిస్తున్న బాతు!

duck earning more than 3 lakhs every month
  • పెన్సిల్వేనియాలో ‘డంకిన్ డక్స్’ చాలా ఫేమస్
  • మంచ్‌కిన్ అనే బాతుతో అనుభవాలు పంచుకుంటున్న టీనేజర్
  • లక్షల్లో పెరిగిన ఫాలోవర్లతో భారీ సంపాదన
ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువగా కష్టపడే పెంపుడు జంతువు ఏది? అంటే పెన్సిల్వేనియా ప్రజలు టక్కున చెప్పే సమాధానం ‘మంచ్ కిన్’. ఇదో బాతు. 20 ఏళ్ల అమ్మాయి క్రిస్సీ ఎల్లీస్ దీనిని పెంచుకుంటోంది. ఆమెకు చిన్నప్పటి నుంచి బాతులంటే ఇష్టం. టీనేజ్‌లో ఉండగా ‘మంచ్ కిన్’ అనే బాతు ఆమె వద్దకు చేరింది.

వీరిద్దరికి కలిపి ‘డంకిన్ డక్స్’ అని ఒక సోషల్ మీడియా ఖాతా కూడా తెరిచేసింది క్రిస్సీ. తనతోపాటు రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు తిప్పుతూ మంచ్ కిన్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించింది. ఇలా ఈ ‘డంకిన్ డక్స్’ బాగా ఫేమస్ అయిపోయారు. వీరికి ప్రస్తుతం టిక్‌టాక్‌లో 2.7 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 లక్షల మంది ఫాలోవర్లు తయారయ్యారు.

దీంతో వీరిద్దరి సంపాదన కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం వీరు నెలకు రూ. 3,34,363పైగా సంపాదిస్తున్నారు. వీరు ఎంతలా పాప్యులర్ అయ్యారంటే అమెరికాకు చెందిన ప్రఖ్యాత వార్తాసంస్థ కూడా ‘కష్టపడి పనిచేసే పెట్’ అంటూ మంచ్‌కిన్‌పై ఓ కథనం ప్రచురించింది.
Duck
Social Media
TikTok
Instagram
Dunking Ducks

More Telugu News