Pawan Kalyan: "వీళ్లే నా గుండె చప్పుళ్లు" అంటూ వీడియో పంచుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan shares a video of Janasena workers
  • రాజకీయాల్లో తీవ్రత పెంచిన పవన్
  • ఇటీవల ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగిన వైనం
  • పవన్ సభ కోసం మోకాలి లోతు నీటిలో జనసైనికులు
  • మీకు రుణపడి ఉంటానంటూ పవన్ భావోద్వేగం
జనసేనాని పవన్ కల్యాణ్ గత కొన్నిరోజులుగా తన రాజకీయ కార్యకలాపాల్లో దూకుడు కనబరుస్తున్నారు. సినిమా టికెట్ల వ్యవహారం, రోడ్ల పరిస్థితులు-శ్రమదానం వంటి అంశాల్లో అది స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో ఆయన ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. సభకు వస్తున్న జనసైనికులు మోకాలి లోతు నీళ్లలో నడుస్తున్న దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు. పోలీసులు రౌడీ రాజ్యానికి మద్దతు పలుకుతున్నారని, జనసేన కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ వీడియోలో ఓ యువకుడు పేర్కొన్నాడు. అయితే తమను ఎవరూ అడ్డుకోలేరంటూ జై జనసేన అంటూ నినదించాడు.

దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. నా జన సైనికులు, నా గుండె చప్పుళ్లు అంటూ సగర్వంగా ప్రకటించారు. మీరు సమాజానికి సుస్థిరతను తెచ్చే యోధులు... మీకు నా కృతజ్ఞతలు, నేను మీకు రుణగ్రస్తుడిని అంటూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan
Video
Janasena
Workers
Andhra Pradesh

More Telugu News