తెలంగాణ, ఏపీ సహా 12 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
- విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని పిలుపు
- రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుదామన్న స్టాలిన్
- ప్రధానంగా నీట్ ప్రస్తావన
- ఏకే రాజన్ కమిటీ నివేదికను పంచుకున్న వైనం
తన లేఖలో ప్రధానంగా నీట్ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై నీట్ ప్రభావాన్ని ఎత్తిచూపారు. దీనిపై ఏకే రాజన్ కమిటీ నివేదిక కాపీని కూడా స్టాలిన్ 12 రాష్ట్రాల సీఎంలకు లేఖతో పాటు పంపారు. అంతేకాదు, ఏకే రాజన్ కమిటీ సిఫారసు చేసిన మేరకు తమిళనాడు అసెంబ్లీలో ఆమోదం పొందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ బిల్లు కాపీని కూడా తన లేఖకు జతచేశారు.