Air India: బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన ఎయిర్ ఇండియా విమానం.. దాంతో తమకు సంబంధం లేదన్న సంస్థ

Air India Plane Gets Stuck Under Foot Over Bridge near Delhi Airport
  • గతేడాదే సేవల నుంచి ఆ విమానాన్ని తప్పించామన్న ఎయిర్ ఇండియా
  • తరలిస్తుండగా ఎన్‌సీఆర్‌లో వంతెన కింద ఇరుక్కుపోయిన వైనం
  • వైరల్ అవుతున్న వీడియో
ఎయిర్ ఇండియా విమానం ఒకటి బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏమైందంటే.. సేవల నుంచి తప్పించిన విమానాన్ని ఎయిర్ ఇండియా స్క్రాప్ కింద అమ్మేసింది. దీనిని తరలిస్తున్న సమయంలో జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో వంతెన కింద ఇరుక్కుపోయింది.

విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ విమానాన్ని గతేడాదే సేవల నుంచి తప్పించినట్టు చెప్పారు. విమానాన్ని తుక్కు కింద కొనుక్కున్న వారు శనివారం దాని తరలింపును చేపట్టినట్టు పేర్కొన్నారు. కాబట్టి ఈ విమానంతో ఎయిర్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Air India
Foot Over Bridge
New Delhi

More Telugu News