ఆవేశం, ఆలోచన ఉన్న మన నాయకుడిని కాపాడుకుందాం: వంగవీటి రాధాకృష్ణ
- ఒకప్పుడు మన నాయకుడు రంగాగారిని కాపాడుకోలేకపోయాం
- కులం, మతంతో సంబంధం లేకుండా అందరినీ ఆదుకున్న నేత రంగా
- పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది
కులాన్ని తిట్టడాన్ని చాలా గొప్పగా భావిస్తున్నారని మండిపడ్డారు. కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలనే కూల్చేయగల గొప్పదనం ఈ కులంలో ఉందని అన్నారు. కాబట్టి ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రంగా ఒక కులానికి ఆరాధ్య దైవమని అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కులం, మతం చూడకుండా ఆదుకోవడమే రంగాగారి గొప్పతనమని, అందుకనే ఆయనకు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజలు నీరాజనాలు పడుతున్నారని రాధాకృష్ణ అన్నారు.