హైదరాబాదులో 'రిపబ్లిక్' సినిమా చూసిన రేవంత్ రెడ్డి
- ఏఎంబీ థియేటర్ కు విచ్చేసిన రేవంత్ రెడ్డి
- ఎమ్మెల్యే సీతక్క, గాయని స్మితలతో కలిసి వీక్షించిన వైనం
- చిత్ర బృందానికి అభినందనలు
- అక్టోబరు 1న రిలీజైన 'రిపబ్లిక్'
- సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య జంటగా చిత్రం
- దేవా కట్టా దర్శకత్వం
దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన 'రిపబ్లిక్' చిత్రంలో సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించారు. ఇందులో సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. సామాజిక దృక్కోణంలో తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబరు 1న రిలీజైంది. ఈ సినిమా ఆలోచింపజేసేదిగా ఉందంటూ విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి.