Panja Vaisshnav Tej: 'కొండ పొలం' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

Kondapolam video song released
  • కొండ ప్రాంతంలోని ప్రేమకథ
  • వైష్ణవ్ తేజ్ జోడీగా రకుల్
  • సంగీత దర్శకుడిగా కీరవాణి
  • అక్టోబర్ 8వ తేదీన విడుదల  

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్, 'కొండ పొలం' సినిమాను రూపొందించారు. అడవిలోని ఒక కొండ ప్రాంతం .. అక్కడ నివసించేవారి జీవితాలను కళ్ల ముందుంచే ప్రయత్నం చేసిన సినిమా ఇది. గూడెంకు చెందిన పశువుల కాపరిగా వైష్ణవ్ తేజ్ కనిపించనున్నాడు. ఆయన జోడీగా అదే గూడెంకు చెందిన అమ్మాయిగా రకుల్ అలరించనుంది.

సాయిబాబు - రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను, అక్టోబర్ 8వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. 'నీలో నాలో శ్వాసలో హద్దులను దాటాలన్న ఆశ .. ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోశా .. ' అంటూ ఈ పాట సాగింది.

కీరవాణి స్వరపరిచిన ఈ బాణీ కొత్తగా ఉంది. సాహిత్యాన్ని కూడా ఆయనే అందించడం విశేషం. యామిని ఘంటసాల .. రోహిత్ ఈ పాటకు ప్రాణం పోశారు. నాయకా నాయికల మధ్య ప్రేమలోని గాఢతకు అద్దం పట్టే పాట ఇది. బ్యూటిఫుల్ విజువల్స్ పై కట్ చేసిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. 

  • Loading...

More Telugu News