నా కరోనా మందు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డంకులు సృష్టించారు: ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు
- నన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా వచ్చారు
- గ్రామస్థులంతా అండగా నిలవడంతో పోలీసులు వెనుదిరిగారు
- ఆయుర్వేదానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాల్సి ఉంది
తాజాగా ఆనందయ్య మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు. తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని అన్నారు. తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా వచ్చారని... అయితే, గ్రామస్థులంతా అండగా నిలవడంతో అరెస్ట్ చేయకుండా వెనుదిరిగారని చెప్పారు. విజయనగరంలో జరిగిన యాదవ మహాసభ సమితి కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేదానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని చెప్పారు.