Kodela Siva Prasada Rao: ఏపీ మాజీ స్పీకర్ కోడెల పేరుతో నిర్మించిన ఆర్చి ధ్వంసం.. గుంటూరు జిల్లాలో ఘటన

Arch built in the name of former AP Speaker Kodela demolished in Guntur district
  • మర్రిచెట్టుపాలెంలో 2015లో నిర్మాణం
  • 2015లో సొంత ఖర్చుతో నిర్మించిన రుద్ర పెదవేమయ్య
  • ధ్వంసం చేసి రోడ్డుకు అడ్డంగా పడేసిన దుండగులు

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు పేరుతో నిర్మించిన ఆర్చీని గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెంలో ఈ ఘటన జరిగింది. స్థానిక ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద కోడెల పేరుతో బెహరావారిపాలేనికి చెందిన రుద్ర పెదవేమయ్య 2015లో సొంత ఖర్చుతో ఓ ముఖ ద్వారాన్ని నిర్మించారు. అయితే, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దానిని ధ్వంసం చేసిన దుండగులు రోడ్డుకు అడ్డంగా పడేశారు. రుద్ర పెదవేమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News