వచ్చే 6 నుంచి 8 వారాలు జాగ్రత్తగా ఉండండి: ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా
- జాగ్రత్తలు పాటిస్తేనే మనం కరోనా నుంచి బయటపడతాం
- వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి
- మళ్లీ కరోనా కేసులు పెరిగే పరిస్థితి తీసుకురావద్దు
వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. టీకా తీసుకున్న వారికి ఒకవేళ కరోనా సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుందని చెప్పారు. వ్యాక్సిన్ అనేది రోగం తీవ్రతరం కాకుండా చూస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రస్తుతం తిరోగమనంలో సాగుతోందని... ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. మళ్లీ కేసుల సంఖ్య పెంచే పరిస్థితిని తీసుకురాకూడదని అన్నారు. అందరూ మాస్కులు ధరించాలని, ఎక్కువ మంది ఒకే చోట గుమికూడవద్దని సూచించారు.