జగపతిబాబు ఇంతవరకూ ఇలాంటి పాత్ర చేయలేదు: అజయ్ భూపతి
- వైజాగ్ లో ఎక్కువ రోజులు షూటింగు జరుపుకున్న సినిమా
- అనవసరమైన పాత్ర అనేది కనిపించదు
- 'ఆర్ ఎక్స్ 100' ను మించిన ఎమోషన్స్ ఉంటాయి
- జగపతిబాబు కెరియర్లో నిలిచిపోయే పాత్ర
తాజాగా ఈ సినిమాను గురించి అజయ్ భూపతి మాట్లాడాడు. ఈ సినిమా షూటింగు ఎక్కువ భాగం వైజాగ్ లో చిత్రీకరించాము. అత్యధిక రోజులు వైజాగ్ లో షూటింగును జరుపుకున్న సినిమా ఇదే. 'ఆర్ ఎక్స్ 100'ను మించిన ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. సినిమా చూశాక .. నేను చెప్పింది నిజమేనని ఒప్పుకుంటారు.
జగపతిబాబుగారు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ తరహా పాత్రను ఆయన ఇంతవరకూ చేయలేదని నేను బలంగా చెప్పగలను. తప్పకుండా ఇది ఆయన కెరియర్లో గుర్తుపెట్టుకోదగిన పాత్ర అవుతుంది. ఈ సినిమాలో అనవసరమైన పాత్రగానీ .. అనవసరమైన సన్నివేశం గాని కనిపించదు" అని చెప్పుకొచ్చాడు.