అనుష్క పెళ్లి గురించి పండిట్ జగన్నాథ్ గురూజీ ఏం చెప్పారంటే..?
- అనుష్క జాతకాన్ని పండిట్ జగన్నాథ్ గురూజీకి చూపించిన అభిమానులు
- ఇండస్ట్రీ బయటి వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందన్న గురూజీ
- 2023లోగా పెళ్లవుతుందని జోస్యం
ఈ నేపథ్యంలో ఆమె జాతకాన్ని కొందరు అభిమానులు జ్యోతిష్యులకు చూపించారు. ఆమె జాతకాన్ని చూసిన ప్రముఖ పండిట్ జగన్నాథ్ గురూజీ కీలక విషయాలను తెలిపారు. ఆమె పెళ్లిపై వచ్చిన వార్తలు నిజం కాదని, అవన్నీ పుకార్లు మాత్రమేనని ఆయన చెప్పారు. వృత్తి విషయంలో అనుష్క ఎంతో సిన్సియర్ గా ఉంటుందని అన్నారు. ఆమె ముఖాన్ని బట్టి చూస్తే, ఒకే వృత్తిలో ఉన్న వారితో కలవడానికి ఆమె ఇష్టపడదని చెప్పారు. ఆమెలో అహంకారం కూడా ఉండదని తెలిపారు.
ఆమె కెరీర్ ఇంకా గొప్పగా ఉంటుందని తెలిపారు. సినీ పరిశ్రమలో ఉన్నంత కాలం ఆమె స్టార్ గానే ఉంటుందని చెప్పారు. ఇండస్ట్రీ బయటి వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అన్నారు. వచ్చే ఏడాది ఆమె పెళ్లి అవుతుందని... లేనిపక్షంలో 2023లోపు పెళ్లితంతు పూర్తవుతుందని చెప్పారు.