JC Diwakar Reddy: ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తా: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో జేసీ దివాకర్ రెడ్డి 

Will come back to Telangana says JC Diwakar Reddy
  • సీఎల్పీ పాత మిత్రులందరినీ కలిశాను
  • ప్రస్తుతం రాజకీయాలు, సమాజం రెండూ బాగోలేవు
  • తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయాను
ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీలో పాత మిత్రులందరినీ కలిశానని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలే కాక, సమాజం కూడా బాగోలేదని అన్నారు. అయితే ఏపీ కంటే తెలంగాణ రాజకీయాలే బాగున్నాయని వ్యాఖ్యానించారు.

ఇక తాను తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయానని... ఏపీని వదిలేసి తాను తెలంగాణకు వస్తానని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పారు.
JC Diwakar Reddy
Telugudesam
Telangana
Andhra Pradesh
Politics

More Telugu News