ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన ఇంటర్పోల్ వాంటెడ్ క్రిమినల్
- 60 ఏళ్ల వయసులో ఫుట్బాల్ ఆడిన రోనీ బ్రున్స్విక్
- సురినామే క్లబ్ యజమాని, సహవ్యవస్థాపకుడు కూడా
- డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో వాంటెడ్ క్రిమినల్
సురినామే రాజధాని పరామారిబోలో జరిగిన ఈ మ్యాచ్లో 60 ఏళ్ల బ్రున్స్విక్ ఇంటర్ మోంగెటోప్ జట్టు సారధిగా వ్యవహరించాడు. మ్యాచ్లో 54 నిమిషాలపాటు ఉన్న బ్రున్స్విక్ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆ తర్వాత వేరే ఆటగాడు అతని స్థానంలో వచ్చాడు. ఈ మ్యాచ్లో అతని జట్టు 0-6 గోల్స్ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమిపై క్లబ్ అభిమానులు తీవ్రమైన నిరాశ వ్యక్తం చేశారు.
కాగా బ్రున్స్విక్ కోసం చాలా కాలంగా ఇంటర్పోల్ వెదుకుతోంది. డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో అతనిపై కేసులు ఉన్నాయి. ఈ నేరంలోనే అతన్ని వాంటెడ్ నేరస్థుడిగా ఇంటర్పోల్ ప్రకటించింది. అలాంటి వ్యక్తి ఇలా ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.